Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జీవిత తృష్ణలను నాదు తీర్చుమయ్యా ప్రియ Telugu Christian Song Lyrics

జీవిత తృష్ణలను నాదు తీర్చుమయ్యా ప్రియ Lyrics

జీవిత తృష్ణలను - నాదు
తీర్చుమయ్యా ప్రియ - యేసునాథా
1. నా జీవాధారము నీవే - నీ నుండే జీవము ప్రవహించు
ప్రవహించే ఈ నీ జీవముతో - ప్రభువా నన్ను నింపుము
2. నా శాంతిదాతవు నీవే - శాంతము నీనుండే వచ్చునుగా
నిశ్చలమైన నీ శాంతముతో - నా జీవితమును నింపుము
3. సత్యానందమును నీవే ప్రభు - అసమానము నీ యానందమేగా
అత్యానంద భరితునిగాజేసి - నిత్యము నన్ను నింపుము
4. పరిశుద్ధ జీవానందము - పరిశుద్ధతను నా కొసగితివి
నిరతము నా జీవితము ద్వారా - లోకమును దీవించుము


Your favourites

  • No Favourites found!