Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జీవితంబు ఘోర కష్టనష్టముల్ఆవరించి నిన్ను దుఃఖపర్చినదేవుడిచ్చినట్టి Telugu Christian Song Lyrics

జీవితంబు ఘోర కష్టనష్టముల్ఆవరించి నిన్ను దుఃఖపర్చినదేవుడిచ్చినట్టి Lyrics

1. జీవితంబు ఘోర కష్టనష్టముల్
ఆవరించి నిన్ను దుఃఖపర్చిన
దేవుడిచ్చినట్టి యీవులెంచుము
నీవాశ్చర్యమందెదవు వాటికై
ఎంచుము లెక్కించు మీవులన్
ఎంచి, చూడు మేసు దీవెనల్
ఎంచు, మెంచు - మెంచు మీవులన్
వింత నొందెదవు నీవు వాటికై
2. చిమ మానసంబు నీకు కల్గినన్
వంతచే భారంబు గల్గు నీయెదన్
సంతసంబుతోడ నెంచు మీవులన్
వింతతో స్మరించు మేసు నామమున్
3. నాశనంబు జెందు నాస్తి జూచినన్
వాసిగా శ్రీయేసు నా కొసంగిన
భాసురంపు భాగ్యము దలంపుమా
యీ సుభాగ్యమే కదా సదాయుండు
4. జీవితాదియందు ధైర్య మొందుము
దేవుడుండు తన వార్కి తోడుగ
జీవయాత్రయందు సాయమియ్యగన్
దేవదూతల్ నీకు తోడుగా నుండు


Your favourites

  • No Favourites found!