Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని Telugu Christian Song Lyrics

జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని Lyrics

జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి
ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాం||

1. ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును
నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ||జీవితాం||

2. అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె తిన్నగా నీ
మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాం||

3. నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను
గెల్వను చాలు నీ కృప రక్షకా ||జీవితాం||

4. నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ చెదర గొట్టుము
రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాం||

5. మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక
నిన్ను వీడనంటిని రక్షకా ||జీవితాం||

6. పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక ఎపుడు నిన్నే
వెంబడింపగ కృప నొసంగుము రక్షకా ||జీవితాం||

Your favourites

  • No Favourites found!