Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జీవితాంతమునే నీతో నడవాలని ఎన్నడు నీ Telugu Christian Song Lyrics

జీవితాంతమునే నీతో నడవాలని ఎన్నడు నీ Lyrics


జీవితాంతమునే నీతో నడవాలని
ఎన్నడు నీ చేయి నేను విడువరాదని
నీ సన్నిధిలో నిత్యమునే నుండలాని
నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని
నా మనసాంత నీవై నిండాలని
తీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కొరికా
పడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడితిని
యేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా (2)
దారి తప్పియున్న నన్ను వెదకి రక్షియించినావయ్యా (2)

1. నేకన్న పగటికలలన్ని కల్లలాయెను
నీవు లేని నా స్వానీతి వ్యర్ధమాయెను (2)
నన్ను నమ్ముటె నాకు మొసమాయెను
భయముతోటి నా కన్ను నిద్రమరిచెను (2)
మనసులోన మానిపోని గాయమాయెను (2)
నీ ప్రేమ ఇచ్చెనాకు ఓ క్రొత్త జీవితం (2)

2. లోకంతో గడపాలని పొంగి పోతిని
దాని కనుసైగలోన నేను నడుచుకుంటిని (2)
చెడ్డదైన బ్రతుకు సరి చేయ జూసితి
ప్రయాసము వ్యర్ధమై నే నీరసిల్లితి (2)
ముగుసి పోయెననుకొంటి నా ప్రయాణము (2)
నీ ప్రేమ ఇచ్చెనాకు ఓ క్రొత్త జీవితం (2)

Your favourites

  • No Favourites found!