Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు Telugu Christian Song Lyrics

జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు Lyrics

జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం
యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2)
సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా
ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా ||జీవితంలో||
ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం
నిరతము యేసునే స్తుతియించాలని
కూడగట్టుకున్నాను శక్తన్తయు
నిరతము యేసునే చాటించాలని
ఆ యేసే నిత్య రాజ్యము
ఆ యేసే గొప్ప సత్యము (2) ||జీవితంలో||
నిర్మించుకున్నాను నా జీవితం
సతతం యేసులో జీవించాలని
పయనిస్తు ఉన్నాను నా బ్రతుకులో
యేసయ్య చిత్తము జరిగించాలని
ఆ యేసే సత్య మార్గము
ఆ యేసే నిత్య జీవము (2) ||జీవితంలో||

Your favourites

  • No Favourites found!