కారుచున్నది యేసు రక్తము
కాలువలై పారుచున్నది
నీ కోరకే అని యోచింపవా
యేసయ్యకొరకు జీవించవా
1. మన పాప రోగములను భరియించెను
మన వ్యసనముల ఆయనే వహించెను
మొత్తబడినవాడై బాదింపబడెను
మన అతిక్రమముల కొరకై గాయపరచబడెనుగా
||కారుచున్నది||
2. బాధింపబడినను నోరు తెరువలేదు
దౌర్జన్యము నొందుచు మౌనముగా నుండెను
అన్యాయపు తీర్పు నొంది కొనిపోబడెను
ఆదరించు వారు లేక అల్లాడిపోయాను
||కారుచున్నది||
