Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కావలివాడా ఓ కావలివాడా Telugu Christian Song Lyrics

కావలివాడా ఓ కావలివాడా Lyrics

కావలివాడా ఓ కావలివాడా
కనులు తెరచి పొలమును చూడు
కోతకు వచ్చిన పంటను కోయుము        ||కావలి||

పిలిచెను నీ యజమానుడు
జత పనివాడవై యుండుటకు (2)
కొలుచును నీ ఫలమంతమున
పని చేసిన రీతిగనే (2)     ||కావలి||

నమ్మెను నీ యజమానుడు
అప్పగించెను తన స్వాస్థ్యము (2)
తిరిగి వచ్చును జీతమియ్యను
సిద్ధ పడుము ఇక నిద్ర మాని (2)     ||కావలి||

ఎంచెను నీ యజమానుడు
నీ పాదములు సుందరములని (2)
ఉంచెను కర్మెలు పర్వతముపై
పరుగిడుము పరాక్రమ శాలివై (2)     ||కావలి||

వేయుము పునాది నేర్పరివై
చెక్కుము రాళ్లను శిల్ప కారివై (2)
కొయ్య కాలును కర్ర గడ్డియు
కాలిపోవును అగ్ని పరీక్షలో (2)     ||కావలి||

Your favourites

  • No Favourites found!