Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కాచి కాపాడినావు నన్ను దీవించినావు Telugu Christian Song Lyrics

కాచి కాపాడినావు నన్ను దీవించినావు Lyrics

కాచి కాపాడినావు నన్ను దీవించినావు (2)
గడచిన కాలమంతా నన్ను రక్షించినావు
నీవే నా తోడుగా అండగా నిలచినావు (2)

1. ఇశ్రాయేలీల జనాంగమును
ప్రేమతో నీవు పిలిచినావు (2)
నలబై ఏళ్ళ ప్రయాణములో
కొరతలేక నడిపించినావు (2)
కొరతలేక నడిపించినావు…
నీవే నాతోడుగా… అండగా నిలువగా ….
గడచిన కాలమంతా – నన్ను రక్షించినావు
|| కాచి కాపాడినావు ||

2. అబ్రాహామును ఆశీర్వదించి
గర్బఫలమును ఇచ్చినావు (2)
ఆస్తి ఐశ్వర్యం సర్వసంపదలిచ్చి
శారా కోరిక తీర్చినావు (2)
శారా కోరిక తీర్చినావు…
నీవే నాతోడుగా…. అండగా నిలువగా…
గడచిన కాలమంతా నన్ను రక్షించినావు
|| కాచి కాపాడినావు ||

Your favourites

  • No Favourites found!