Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కదలకుందువు Telugu Christian Song Lyrics

కదలకుందువు Lyrics


కదలకుందువు సీయోను కొండవలె
బెదరకుందువు బలమైన సింహం వలె (2)
యేసయ్య నీ చెంత ఉండగా
ఏ చింత నీకింక లేదుగా (2)

కష్టములెన్నో కలుగుచున్ననూ
నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ
దుష్ట జనములుపై దుమికి తరిమిన
భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా          ||కదలకుందువు||

నీటి వరదలు నిలువెత్తున వచ్చినా
నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా
ఆకాశము నుండి పై అగ్ని కురసినన్
ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు             ||కదలకుందువు||

నీరు కట్టిన తోటవలెను
నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను
నీటి కాల్వల యోరను నాటబడినదై
వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్            ||కదలకుందువు||

Your favourites

  • No Favourites found!