Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కలలాంటి బ్రతుకు నాది Telugu Christian Song Lyrics

కలలాంటి బ్రతుకు నాది Lyrics

కలలాంటి బ్రతుకు నాది
కన్నీటి ఊట నాది (2)
కలలోనైనా ఊహించలేదే
కమనీయమైన ఈ బంధం
కల్వరిలో సిలువ త్యాగ బంధం (2)      ||కలలాంటి||

నేనేమిటో నా గతమేమిటో
తెలిసిన వారే క్షమియించలేరే
నా నడకేమిటో పడకేమిటో
ఎరిగిన వారే మన్నించలేరే
హేయుడనై చెడియుండగా.. నా యేసయ్యా
ధన్యునిగా నను మార్చినావే (2)       ||కలలాంటి||

నేనేమిటో నా విలువేమిటో
తెలియకనే తిరుగాడినానే
నీవేమిటో నీ ప్రేమేమిటో
ఎరుగక నిను నే ఎదిరించినానే
హీనుడనై పడియుండగా.. నా యేసయ్యా
దీవెనగా నను మార్చినావే (2)       ||కలలాంటి||

Your favourites

  • No Favourites found!