Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కలములతో వ్రాయగలమా.. కవితలతో వర్ణించగలమా.. కళలతో Telugu Christian Song Lyrics

కలములతో వ్రాయగలమా.. కవితలతో వర్ణించగలమా.. కళలతో Lyrics

కలములతో వ్రాయగలమా.. కవితలతో వర్ణించగలమా.. ?
కళలతో వివరించగలమా.. నీ మహోన్నతమైన ప్రేమా... = 2
ఆరాధింతును - ఆరాధింతును - 2
రారాజువు నీవే - నా తండ్రివి నీవే - నిను విడువను ఎడబాయను - 2

1. ఆకాశములు - నీ మహిమను - వివరించుచున్నవి
అంతరిక్షము - నీ చేతిపనిని - వర్ణించుచున్నది = 2
దేవా.. నా ప్రాణము - నీకొరకై తపియించుచున్నది - 2
ఆరాధింతును - ఆరాధింతును - 2
రారాజువు నీవే - నా తండ్రివి నీవే - నిను విడువను ఎడబాయను - 2

2. సెరాపులు - కెరూబులు - నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహాదూతలు - ప్రధానదూతలు - నీ నామము కీర్తించుచున్నవి = 2
దేవా.. నా ప్రాణము - నీకొరకై తపియించుచున్నది - 2
ఆరాధింతును - ఆరాధింతును - 2
రారాజువు నీవే - నా తండ్రివి నీవే - నిను విడువను ఎడబాయను - 2

Your favourites

  • No Favourites found!