Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనావిడువని దేవుడా Telugu Christian Song Lyrics

కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనావిడువని దేవుడా Lyrics

కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా
విడువని దేవుడా నా యేసయ్యా
శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా
ఓదార్చే దేవుడా యేసయ్యా
ప్రేమించే వారే లేకున్నా
నన్ను కరుణించే వారే లేకున్నా
ఆదరించే యేసు నన్ను
తల్లి కన్న మిన్నయై ||కలనైనా||
జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినావు
లోకమంత నను విడచినను విడువనన్న యేసయ్యా
నీకేమి చెల్లింతు యేసయ్యా
నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||
పరిశుద్ధాత్మతో నను నింపి శుద్ధిపరచువాడవు
లేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవు
నీకేమి చెల్లింతు యేసయ్యా
నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||

Your favourites

  • No Favourites found!