Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కలుగు Telugu Christian Song Lyrics

కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కలుగు Lyrics

కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కలుగు నున్నతమైన
ఘన స్థలములందున నిలకు సమాధానం నరుల కాయన దయ ||కలుగును||

1.
ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల
పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము ||కలుగును||

2.
మహిమపర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును
మదిఁ దలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము ||కలుగును||

3.
ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక
పాపము మోయు ఏక దేవుని గొఱ్ఱె పిల్ల మమ్మును కనికరించుము చల్లఁగ ||కలుగును||

4.
లోకపాపములు మోయుచుఁ బోవు యేసు రక్షకా వాసిగ
జనకుని కుడివైపునఁ గూర్చుండి యేసూ మా ప్రార్థన నాలించి కనికరించు ||కలుగును||

5.
పరిశుద్ధుఁడవు ప్రభుఁడవు నీవో ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతోఁ
తండ్రి యైన దేవునియందుఁబరిపూర్ణ మహిమతోఁ బ్రబలుచున్నామవామేన్ ||కలుగును||

Your favourites

  • No Favourites found!