Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కలువరి సిలువలో కలుషము బాపనూ కరుణను Telugu Christian Song Lyrics

కలువరి సిలువలో కలుషము బాపనూ కరుణను Lyrics

కలువరి సిలువలో కలుషము బాపనూ
కరుణను చూపింది నీప్రేమ  (2)
మరువను ఆఘోరమూ, విడువను నీ స్నేహము,
మరువను నీ త్యాగము, మరలక నీ మార్గము,

యేసయ్య యేసయ్య నీ ప్రేమా త్యాగం
గొప్పదయా గొప్పదయా  || కలువరి ||

1. నా దేవా నా దేవా నన్నేల
విడనాడితివి అని కేక వేసితివి
తండ్రి చిత్తం నెరవేర్చుటకు
గొప్ప రక్షణ తెచ్చుటకు సమస్తమును నోర్చితివి
భరించలేని ఆ బాధలోనూ సిలువను విడివక సాగితివి,
శిరస్సావహించి బలి అయితివా

యేసయ్య యేసయ్య నీ ప్రేమా త్యాగం
గొప్పదయా గొప్పదయా  || కలువరి ||

2. పాపినైన నా కోసం నీ ప్రాణమంతా నిచ్చుటకు
పరమును వీడితివా.
పాప శాపం బాపుటకు నీరక్తమంతా చిందించుటకు
నరునిగ మారుతివా
నిర్దోషమైన నీ రక్తమే నిరపరాదులుగా మార్చుటకు
ఏరులై పారినదా,

యేసయ్య యేసయ్య నీ ప్రేమా త్యాగం
గొప్పదయా గొప్పదయా  || కలువరి ||

Your favourites

  • No Favourites found!