కలువరి సిలువలో కలుషము బాపనూ
కరుణను చూపింది నీప్రేమ (2)
మరువను ఆఘోరమూ, విడువను నీ స్నేహము,
మరువను నీ త్యాగము, మరలక నీ మార్గము,
యేసయ్య యేసయ్య నీ ప్రేమా త్యాగం
గొప్పదయా గొప్పదయా || కలువరి ||
1. నా దేవా నా దేవా నన్నేల
విడనాడితివి అని కేక వేసితివి
తండ్రి చిత్తం నెరవేర్చుటకు
గొప్ప రక్షణ తెచ్చుటకు సమస్తమును నోర్చితివి
భరించలేని ఆ బాధలోనూ సిలువను విడివక సాగితివి,
శిరస్సావహించి బలి అయితివా
యేసయ్య యేసయ్య నీ ప్రేమా త్యాగం
గొప్పదయా గొప్పదయా || కలువరి ||
2. పాపినైన నా కోసం నీ ప్రాణమంతా నిచ్చుటకు
పరమును వీడితివా.
పాప శాపం బాపుటకు నీరక్తమంతా చిందించుటకు
నరునిగ మారుతివా
నిర్దోషమైన నీ రక్తమే నిరపరాదులుగా మార్చుటకు
ఏరులై పారినదా,
యేసయ్య యేసయ్య నీ ప్రేమా త్యాగం
గొప్పదయా గొప్పదయా || కలువరి ||
