Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస Telugu Christian Song Lyrics

కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస Lyrics

కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస ||కల్వరి||

1. సిలువపై జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి తలను ముండ్ల
కిరీటంబదేమి తరచి చూడుమీ ||కల్వరి||

2. పరులకుపకారంబు సల్ప ధరను వెలసిన వరపాదముల కఱకు మేకులు
గొట్టెద రేల కరుణాలవాల ||కల్వరి||

3. కరముపట్టి దరిని జేర్చి వరములిడి దీవించిన యా కరుణగల చేతులలో
చీల గుచ్చెద రేల ||కల్వరి||

4. ప్రేమ,కృప,నిర్మలత్వమును నీమమును గల మోముపైన పామరులుమి
వేసెదరేల పాటించరేల ||కల్వరి||

5. ఘోర యాతనలును నీదు క్రూరమరణము చూడ గుండె నీరు నీరైపోవదె
దేవ క్రూరునికైన ||కల్వరి||

6. పాపమేమిచేసి యెరుగవు పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి
యింత ఉత్కట బాధ ||కల్వరి||

7. స్వామి మాకై పూటపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి
యది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవ ||కల్వరి||

8. పావనాత్మ నీవు జావ పాపి కబ్బును నిత్యజీవ మావచన సత్యంబు
దెల్పుము మానవాళికిన్ ||కల్వరి||

9. సిలువ దరికాకర్షించుము ఖలుడను ఘోరపాపిని కలుషములు విడ
శక్తినీయుము సిలువ ధ్యానమున ||కల్వరి||

Your favourites

  • No Favourites found!