Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ Telugu Christian Song Lyrics

కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ Lyrics


కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా

1. తుంటరులంత పట్టి కట్టి తిట్టుచు నిన్ను
కొట్టిర తండ్రీ తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రీ
నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా

2. మూడు దినముల్ సమాధిలో ముదముతోడ
నిద్రించితివా ముదముతోడ నిద్రించితివా
నా రక్షణకై సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి

3. ఆరోహణమై వాగ్దానాత్మన్ సంఘముపైకి
పంపించితివా ఆదరణాత్మన్ పంపించితివా
నీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను

Your favourites

  • No Favourites found!