Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత సింహమాకన్ను భ్రమించు Telugu Christian Song Lyrics

కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత సింహమాకన్ను భ్రమించు Lyrics

కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత సింహమా
కన్ను భ్రమించు ప్రభువా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

1. స్తుతికి పాత్రుండగువాడా దూతలతో వేంచేయువాడా
సుదతి మరియ పుత్రుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

2. పాపులకై వచ్చినవాడా ప్రేమగల్గిన రక్షకుడా
పాదములపై బడితిమి సిలువలోనిమిత్రుడా ||కల్వరి||

3. దీవెనలు నిచ్చువాడా వసుధ కేతెంచినవాడా
నీవే సుంకరలాప్తుడవు సిలువలోని మిత్రుడా ||కల్వరి||

4. ఐదు రొట్టెలు మరి రెండు చేపలతో నైదువేల
జనుల పోషించిన తండ్రి సిలువలోని మిత్రుడా ||కల్వరి||

5. నీళ్ళను రసముగ మార్చితివి నీళ్ళమీద నడచితివి
మేళ్ళనొసగు మాదాతా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

6. రోగులను బాగుచేయువాడా గ్రుడ్డికి నేత్రములిచ్చితివి
అనాధుల నాయకుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

7. హల్లెలూయ కర్హుడా యెల్లరు కొనియాడువాడా
బలముతో వచ్చు రాజా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

Your favourites

  • No Favourites found!