కళ్యాణ రాగాల సందడిలో
ఆనంద హరివిల్లులో
మల్లెల పరిమళ జల్లులలో
కోయిల గానాలలో (2)
పరిశుద్ధుడేసుని సన్నిధిలో
నవ దంపతులు ఒకటవ్వగా (2)
స్వాగతం వధువ స్వాగతం
స్వాగతం వరుడా స్వాగతం
నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం
నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
స్వాగతం వధువ స్వాగతం
స్వాగతం వరుడా స్వాగతం
1. నరుడు ఒంటరిగ ఉండరాదని –
జంటగా ఉండ మేలని
ఇరువురి కలయిక దేవుని చిత్తమై –
ఒకరికి ఒకరు నిలవాలని (2)
తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని (2)
స్వాగతం వధువ స్వాగతం
స్వాగతం వరుడా స్వాగతం
నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం
స్వాగతం వరుడా స్వాగతం
స్వాగతం వధువ స్వాగతం
2. సాటిలేని సృష్టి కర్త –
సాటిఐన సహాయము
సర్వ జ్ఞానిఐన దేవుడు –
సమయోచితమైన జ్ఞానముతో (2)
సమకూర్చెను సతిపతులను
ఇది అన్నిటిలో ఘనమైనది (2)
స్వాగతం వధువ స్వాగతం
స్వాగతం వరుడా స్వాగతం
నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం
నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
స్వాగతం వధువ స్వాగతం
స్వాగతం వరుడా స్వాగతం
