కళ్యాణమే వైభోగం
కమనీయ కాంతుల దీపం (2)
శ్రుతిలయల సుమధుర గీతం (2)
దైవ రచిత సుందర కావ్యం //కళ్యాణమే//
1. పరమ దైవమె ప్రరంభించిన పరిశుద్ధమైన కార్యం (2)
నరుని మంచికై తన చేతులతో
ప్రభు రాసిచ్చిన పత్రం //కళ్యాణమే//
2. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం
మోడుగానున్న జీవితాలు (2)
చిగురింపజేసే వసంతం //కళ్యాణమే//
3. దేవదూతలే తొంగిచూసేటి దృశ్యం
భావమధురిమలు పొంగజేసేటి (2)
కమనీయమైన చిత్రం //కళ్యాణమే//
