Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కనరె యేసుని ప్రత్యక్షంబు అన్య జనులకు Telugu Christian Song Lyrics

కనరె యేసుని ప్రత్యక్షంబు అన్య జనులకు Lyrics

కనరె యేసుని ప్రత్యక్షంబు అన్య జనులకు గల్గిన, విధమెట్లొ తరచి
||కనరె||

1. నక్షత్రమార్గాన జ్ఞానుల్ బోయి రక్షకుని జూచిరి రక్తిమీరంగ
కాంక్షతో ప్రభునికి మ్రొక్కి కాంకల్ కాంతిమీరగ నిచ్చి తరలిరి పరగన్
||కనరె||

2. పదియు రెండేడ్ల, ప్రాయమున ప్రభువు పస్కాపండుగునకు పరగబోయెనుగ
ముదమొప్ప దేవాలయములో జేరి ముద్దుగ బోధించె బోధకులకును
||కనరె||

3. కానాయూరి పెండ్లికరిగి ప్రభువు ఘనముగ నీళ్లు ద్రాక్షా రసముగజేసెన్
తనరమహిమను బయలుపరచి శిష్యుల మనములబలపర్చె ఘన
విశ్వాసమున ||కనరె||

4. కుష్థరోగి యొకడువచ్చి తనదు కుష్ఠరోగము బాప ప్రభునివేడంగ
ఇష్టబుద్ధితో ప్రభువువాని ముట్టి కుష్ఠురోగము బాపె కోర్కెలూరంగ ||కనరె||

5. శతాధిపతి విశ్వాసమును ప్రభువు తరచి చూచి మెచ్చి దయజూపె
గనరె హితవుగవాని దాసుని పక్ష వాతంబు స్వస్థత మరిగావించెనుగ
||కనరె||

6. గాలివానల విప్లవంబు ప్రభువు గద్దించి సద్దణిపి ఘనమహిమజూపె
గాలిసంద్రముపైన హక్కు ప్రభునికి గలదంచు శిష్యులు ఘనపరచిరిగ
||కనరె||

7. ఇట్టిశక్తిగల ప్రభుని మనము గట్టిగనమ్మిన గలుగు రక్షణము
పట్టువీడక ప్రభునినెపుడు గుల్పి పరమశాంతిని బొంది మరివెలుగగలము
||కనరె||

Your favourites

  • No Favourites found!