Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కన్నీరే మనిషిని బాధిస్తుంది Telugu Christian Song Lyrics

కన్నీరే మనిషిని బాధిస్తుంది Lyrics

కన్నీరే మనిషిని బాధిస్తుంది
ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది (2)
కన్నీరే కాదనుకుంటే
ఓదార్పే కరువైపోతుంది (2)        ||కన్నీరే||

కన్నీరే మరియను బాధించింది
ఆ కన్నీరే మరణము గెలిపించింది (2)
కన్నీరే కాదనుకుంటే
లాజరు తిరిగి బ్రతికేనా (2)
కన్నీరే వలదనుకుంటే
దేవుని మహిమ కనిపించేనా (2)        ||కన్నీరే||

కన్నీరే హన్నాను బాధించింది
ఆ కన్నీరే కుమారుని దయచేసింది (2)
కన్నీరే కాదనుకుంటే
సమూయేలు జన్మించేనా (2)
కన్నీరే వలదనుకుంటే
దేవుని కృపను గాంచేనా (2)        ||కన్నీరే||

Your favourites

  • No Favourites found!