Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కంట నీరేల? కలతలు ఏల? యేసుతో Telugu Christian Song Lyrics

కంట నీరేల? కలతలు ఏల? యేసుతో Lyrics


కంట నీరేల? కలతలు ఏల?
యేసుతో నీవు సాగు వేళ
శోధన వేళ రోదన ఏల?
నీ విశ్వసము గెలిచే వేళ (2)
నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు
నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట||
వలదు చింతన దేనికైనా
విన్నవించుము నీ నివేదన (2)
పొందితినను నీదు నమ్మకము
దరికి చేర్చును తగిన విజయము (2)
తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు
పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట||
రేపు గూర్చిన భయము వలదు
ప్రతి దినము తగు బాధ కలదు (2)
నీదు భారము మోయు ఆ దేవుడు
నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2)
నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం
స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2) ||కంట||

Your favourites

  • No Favourites found!