Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కనుచూపుమేరలోన ఏ ఆశలేని వేళఎటుతోచక లోలోన Telugu Christian Song Lyrics

కనుచూపుమేరలోన ఏ ఆశలేని వేళఎటుతోచక లోలోన Lyrics

కనుచూపుమేరలోన ఏ ఆశలేని వేళ
ఎటుతోచక లోలోన నే కృంగియున్న వేళ
అ.ప:నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు
1.మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా
బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా
పనిపూర్తి చేయగా బలములేని వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ఆటంకాలన్నిటినీ యేసూ తొలగించావు
2.శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా
చెదిరిపోయి ఆశలసౌధం నా గొంతు మూగబోగా
స్తుతిపాట పాడగా స్వరము రానివేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా నోటను నూతనగీతం యేసూ పలికించావు
3.కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా
సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా
అడుగేసి సాగగా అనువుగాని వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు

Your favourites

  • No Favourites found!