Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని Telugu Christian Song Lyrics

కనుగొంటిని నిన్నే ఓ నజరేయా సమర్థుడవని Lyrics


కనుగొంటిని నిన్నే ఓ నజరేయా - సమర్థుడవని సహాయము చేయ..
నీ ప్రభావము - నాలోకి చేరగా - నా స్వరూపమూ - మారిపోయెగా..


1. ప్రయత్నాలు చేసి వేసారియుంటిని - ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని..
వైద్యులచుట్టూ - కాళ్లు అరిగేటట్టు - ఎంతతిరిగినా - సరికాక యుంటిని..


2. స్వంతజనులతోనే వెలివేయబడితిని - అపనిందలపాలై మతిపోయి చెడితిని..
బ్రతుకెందుకని - మనసే చంపుకుని - జీవశ్చవమై - ఇల మిగిలియుంటిని..


3. నీ మహిమను గూర్చి వార్తలను వింటిని - స్వస్తపరచు దేవా నిను నమ్ముకొంటిని..
ధైర్యములేక - ఎదురుగ రాలేక - వెనుకనుండి వచ్చి నిను ముట్టుకుంటిని..

Your favourites

  • No Favourites found!