Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కన్యా గర్భమున బుట్టి కరుణగల్గు బాలుఁడవైన Telugu Christian Song Lyrics

కన్యా గర్భమున బుట్టి కరుణగల్గు బాలుఁడవైన Lyrics

కన్యా గర్భమున బుట్టి కరుణగల్గు బాలుఁడవైన కన్యా సుతుండ నిన్నే
నమ్మితి నో యేసునాధ కన్ను లెత్తి మమ్ముఁ జూడుము ||కన్యా||

1. బాల ప్రాయమున నేను బాగుగా నీ పాద సేవఁ జాలజేసి యున్న వా
డనుగా యో యేసు నాధ చాల దయతో మేలు చేయుమి ||కన్యా||

2. ఇంపైనట్టి మరియ తనయ యిహము పరము నేలు బాల సొంపుగా నీ
ప్రాపే గోరితి నో యేసునాధ చెంపఁ గొట్టి బుద్ధి చెప్పుము ||కన్యా||

3. తుంటతనము చేత జగము తంటాచేసి తిరుగుచుంటి నంటిన మాయల
బాధల నో యేసు నాధ యంటుఁ బాపి జంటజేయుము ||కన్యా||

4. మింట నుండి నీవు వచ్చి మంటి పైని బాలుఁడ వగుచుఁ గంటి కింపు
గాను నడిచితి వో యేసు నాధ కానుపర్చి తోవు త్రోవను ||గన్యా||

Your favourites

  • No Favourites found!