కాపాడినావే కనుపాపలా
కృప చూపినావే నా యేసయ్య
కల కాదు నిజమే
నీ కరుణాకటాక్షము
కమనీయమైన నీ ప్రేమానుబంధము
చాలయ్య నీ కృపా! నీ క్షమా! నా రక్షకా!
చాలయ్య ఈ దీవెన ! నీ దయే ! నా దైవమా !
1. ఉహించలేదే నీ ప్రేమనాపై
ఉన్నావు నాతో నా తోడు నీవై
ఉజ్జివనాదం మ్రోగించగానే
ఉల్లాసవస్త్రం ధరియింప జేసావే
ఎడబాయలేదే యేనాడు నన్ను
విడనాడలేదే క్షణమైన నన్ను || చాలయ్య ||
2. నేనున్న స్థితినే గమనించినావే
నాగతిని మార్చి ఘనపరచినావే
నా చెలిమి కోరి నా చెంత చేరి
నా చింతలన్ని తొలగించినావే
నాకున్నవన్ని నీవే ఇచ్చినావే
నీ కృపతో నన్ను హెచ్చించినావే || చాలయ్య ||
