Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కరుణా కరుడా నీ మార్గము పరిశుద్ధ Telugu Christian Song Lyrics

కరుణా కరుడా నీ మార్గము పరిశుద్ధ Lyrics

కరుణా కరుడా - నీ మార్గము - పరిశుద్ధ స్థలములో గలదు - అది
1. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు - వారు
తిరిగి వచ్చెదరు సీయోనునకు
2. చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ - తమ
సంతోషం అధికంబగును
3. మోక్షానంద భాగ్యముగలిగి అక్షయులై అరుదెంచెదరు - తమ
దుఃఖం నిట్టూర్పును పోవును
4. విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి - తమ
ప్రభుని కొనియాడిరి బహుగా
5. ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదు
ప్రవిమల నీతి సమాధానం - అది - పరిశుద్ధాత్మానందము
6. మహోన్నతుడే మనకానందం
మహా బలము కలుగును గాక - అది మహిమార్థంబగును గాక
7. హల్లెలూయ ఎల్లరుపాడి
హర్షింతుము ప్రభుయేసునిలో - మన రక్షకుడేసుని పాడెదము


Your favourites

  • No Favourites found!