Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా మనలో అనవరతముమన Telugu Christian Song Lyrics

కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా మనలో అనవరతముమన Lyrics

కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా మనలో అనవరతము
మన బ్రతుకు ప్రభునికై అంకితమగునటు నలవరచుకొనగ ||కఱుణా||

1. పొరుగవాని ప్రేమింతము మనము కొరతలన్ని యిక దీరును మనకు
తరుగుపడ్డదా గుణమది మనలో త్వరితగతిని సవరించుకొందమిక ||కఱుణా||

2. కుంటి గ్రుడ్డి కుష్ఠు రోగులెందరో కంఠమెత్తి ఘోషించుచు నుండ
ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ వంటబట్టదది స్వార్థ పర్వతము
||కఱుణా||

3. పండువంటి కాపురంబు మనది దండిప్రభుడు దయచేసెను మనకది
బండు లోడలౌ ఓడలు బండ్లౌ ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని ||కఱుణా||

4. మనుజులందు గలవు రెండు తెగలు వినుము పుచ్చుకొనెడువారి దొక
తెగ మనసు దీర నిచ్చువారిదొక తెగ గనుమ మనస నీవెందుగలవొ యిక
||కఱుణా||

5. కఱుణ రసము మాకుప్రభువా కలుగను కృపా నిమ్మా యెపుడు అరమర
లేకను అన్ని సమయముల నందర ప్రేమను జూడగ నడుపుమ ||కఱుణా||

Your favourites

  • No Favourites found!