Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్ Telugu Christian Song Lyrics

కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్ Lyrics

కరుణన్ - ఏర్పరచితివి సైన్యముల యెహోవ - నన్
పరిశుద్ధుడా - క్రీస్తులో ఎరిగితివి - కరుణన్
1. మోషేను కోరుకొని - చేసితివి నాయకుని
గోషేను నుండి ఎల్లన్ నడుప - ఒసగితివి యవసరతలను
2. యాకోబున్ కోరుకొని - ఏశావును విడిచితివి
సకలంబౌ కష్టముల నొసగి - ఇశ్రాయేలను పేరును ఇచ్చితివి
3. సొలమోనున్ కోరుకొని - ఇల సకల జ్ఞానమిడె
ఆలయ నిర్మాణ కృపనిడెను - పాలింప రాజ్యంబొసగెను
4. దానియేలును కోరుకొని - తన పరలోక జ్ఞానమిడె
ఎన్నెన్నో దర్శనముల నొసగి - కనుపాపగ కాపాడెనిల
5. జెరుబ్బాబెలున్ కోరుకొని - ముద్రయుంగరముగ జేసెన్
నిర్మించెను ప్రభుని ఆలయమున్ - విరివైన యిరుకుల యందు
6. స్తెఫెనును కోరుకొని - నింపెను తన యాత్మతో
సంపూర్ణమగు తన సాక్షిగా - పంపెను తన హతహాక్షునిగ
7. పౌలును కోరుకొనెన్ - సౌలుగ నున్నయపుడే
పలుసంఘముల నిల స్థాపించెన్
ఎల్ల మేలులకు హల్లెలూయ ప్రభో


Your favourites

  • No Favourites found!