Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ Telugu Christian Song Lyrics

కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ Lyrics

కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ స్థలిని జేరరే పరలోక
జనకుని వరములు లభియించు తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి
||కఱుణా||

1. హృదయ వేదననొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు
వదల కుండగ ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదమున
నొందిన ||కఱుణా||

2. కన్న ప్రేమను యిమ్మని సోదరి హన్నా విన్నవించగా దేవుని అన్ని
యెఱిగిన తండ్రి హన్నాను దీవింప వన్నె కెక్కిన కొడుకున్ చెన్నుగా
నొందిన ||కఱుణా||

3. శాప భయమును నేడ్చుచు దావీదు తన పాప రూపము జూచుచు
తాపముతో పశ్చా త్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్ష మాపణ నొందిన
||కఱుణా||

4. కాయమున వెత నోర్చును యోధుడు పౌలు సాయమీ ధర గోరుచు
రోయుచు దన ముల్లు దీయుమని ప్రార్థించి వేయిరెట్లుగ కృపయు
ప్యాయముగ నొందిన ||కఱుణా||

5. దినమంత పని జేయుచు నాధుడా యేసు జనుల బాధల మోయుచు
ఇనుడు మరుగౌవేళ జనకుని కడకేగి మనసార విశ్రాంతి యనుభవించిన
సథలము ||కఱుణా||

6. ఇల బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన
చెలువుగ విజ్ఞాప నలు జేయుచును మనపై గలకాలమును దీవె నలు
వర్షించెడి చోటు ||కఱుణా||

Your favourites

  • No Favourites found!