Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్వ మెట్టకు Telugu Christian Song Lyrics

కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్వ మెట్టకు Lyrics


1. కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా కరుణ
సాగర వీవెకావ మరియు కల్వరి మెట్టమీఁదను కడకు మేకులుఁ గొట్టబడి
నీ మరణరక్తము చేత నరులకు పరమరక్షణఁ దెల్పినావా ||కరుణ||

2. నజరేతు పుర విహారా నరులఁ బ్రోవ నరు దెంచినావా నజరేతు
పురవిహారా ప్రజలపాపముఁ బరిహరించియు ప్రజల సద్గతి నొందఁ
జేయను విజయమునుఁ బొందితివి యిలలో సజనులందరు భజనసేయఁ
గ ||నజరేతు||

3. మరియయనే కన్యకుమారా నరకబాధఁ దప్పించినావా మరియయనే
కన్యకుమారా మార్గసత్యము జీవనములీ మహిని నమ్మిన వారి కెల్లను
మీరెగాకిఁక వేరేలేరని సారెసారెకుఁ జెప్పినావా ||మరియయనే||

4. మహిలోను మనుజకుమారా యహా తండ్రిని వేడినావా మహిలోను
మనజకుమారా యిహములోనిను నమ్మువారిని బహు నీ కటాక్షంబుచేతను
మహిమజనకా గావుమనుచు త్రాహియని బ్రార్ధించి నావా ||మహిలోను||

5. పరమతండ్రి ప్రియకుమారా పావనముజేయ మీరేకారా పరమతండ్రి
ప్రియకుమారా పరముడా నీ పంచగాయము లరయగా రక్తముతో నిండెను
ధరను మా పాపములుఁ గడుగను చిరముగా ను త్త రమునాయె
||పరమతండ్రి||

Your favourites

  • No Favourites found!