Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కష్ట నష్టాలైనా Telugu Christian Song Lyrics

కష్ట నష్టాలైనా Lyrics

కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2)
ఓ యేసయ్యా…
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే(2)

నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా
బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా
యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2)         ||కష్ట||

కొండగా అండగా – నీవుండగ లోకాన
ఎండిన ఎముకలయినా – ఉండుగా జీవంగా
యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2)         ||కష్ట||

కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను (2)          ||కష్ట||

Your favourites

  • No Favourites found!