Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కవులకైనా సాధ్యమా Telugu Christian Song Lyrics

కవులకైనా సాధ్యమా Lyrics


కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం
ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం
శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం
రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా||

చెదరిన మనసులకూ శాంతి
కృంగిన హృదికీ ఓదార్పు
మృత్యు దేహముకూ జీవం
బలహీనులకు ఆరోగ్యం (2)
పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు
గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు
మోసపూరిత ఈ లోకంలో
ఏ వైద్యునికి సాధ్యము (2)           ||కవులకైనా||

క్షణికమైన అనురాగాలు
ఆవిరివంటి ఆప్యాయతలు
అవసరాల అభిమానాలు
నిలచిపోయే అనుబంధాలు (2)
నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ
ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం
స్వార్ధపూరిత ఈ లోకంలో
ఏ మిత్రునికి సాధ్యము (2)          ||కవులకైనా||

Your favourites

  • No Favourites found!