Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను ఖండింపవలెఁ బాపముండఁజూచి Telugu Christian Song Lyrics

ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను ఖండింపవలెఁ బాపముండఁజూచి Lyrics

ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను ఖండింపవలెఁ బాప
ముండఁజూచి యేసు నండఁజేరి మన గుండె పదిలముఁ జేసి ||ఖండింప||

1. అంధత్వమునను రక్షణమార్గ మందుఁ జేరకయు ఎందెందుఁ జూ
చిన సందులేక పాప మందు మునిఁగి నరలా నందమోందక చెడిరి
||ఖండింప||

2. ఎందు కీ భ్రమలు నీ యందుండు సందేహము వీడు పొందుగ
యేసు సం బంధు డవై యున్న నందమైన మోక్ష మందుఁ జేరుట కొఱకు
||ఖండింప||

3. బెదరక నీవు సాతానుని నెదిరింపవలెను కుదురుగ నీ యేసు
చదరునఁ జేరిన వదరుబోతు లెల్ల నెదురాడ లేరిఁక ||ఖండింప||

4. ఆసింపబోకు లోకభోగములు మోసమై యుండు వాసిగ యేసుని
దాసుఁడవైయున్న గాసిఁ జెందక మోక్ష దాసుఁడ వౌదువు ||ఖండింప||

5. నమ్మి జీవించు యేసుని యందు నెమ్మదిఁ బొందు రమ్ము యేసుని
యొద్ద సొమ్ము నీకున్నది సమ్మతించి మదిని నెమ్మదిగాఁ జూచి ||ఖండింప||

Your favourites

  • No Favourites found!