Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలాటమాడను రా Telugu Christian Song Lyrics

కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలాటమాడను రా Lyrics

కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలాటమాడను రా రా మా
పాలిటి యేసుని పేరఁ మాపాలిటి యేసుని పేర మ మ్మేలెడి దేవుని
పేరఁ ||గోలాహలముగ||

1. మా సామి యా మోక్ష వాసుండు నైనట్టి యేసయ్య పోకను జూడు
మా యేసయ్యరాకను బాడు యేసయ్య రాకను బాడు నీ హోసన్న యని
మదివేడు ||కోలాహలముగ||

2. పాపంబులన్ మోసి ప్రాణంబు బలి యిచ్చి తాఁ బరమున కేగలేదా
నీ జ్ఞాపకములోనికి రాదా జ్ఞాపకములోనికి రాదా నీ ప్రాపకుఁడై
యుండలేదా ||కోలాహలముగ||

3. ఏలినవాడైన యేసుని రాకను నాలించి చూడవదేర నిను పాలించు
వాడనుకోర పాలించువాడనుకోర పరి శీలించువాడనుకోర
||కోలాహలముగ||

4. అంతములో భువి కా యేసునాధుండు చెంతను దూతలతోడ బల్
వింతగ వచ్చును జూడ వింతగ వచ్చును జూడ న త్యంత బలముతోడ
రాఁడ ||కోలాహలముగ||

5. ఆకాశ భూమ్యాదు లార్భటిలు దూతల మూకలతోఁ గూడినాఁడు ఈ
లోకాని కేతెంచుఁవాడు లోకాని కేతెంచువాఁడు ఇఁక వీకతోఁ బ్రభుని
బాడు ||కోలాహలముగ||

6. భీకర సింహపు టాకారముతోను ఢీకొని మేఘములతోడ బల్
బాకారవంబులు బాడ బాకారంబులు బాడ నిటు ఢీకొని వచ్చెను
జూడ ||కోలాహలముగ||

7. భాసురమైనట్టి యేసయ్య రాకను ఈ సూర్యుఁడు జూడలేఁడు తన వి
కాసము జీఁకటౌను వి కాసము జీఁకటౌను నీ కా సుగతిఁ జూపువాఁడు
||కోలాహలముగ||

Your favourites

  • No Favourites found!