Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కొండలలో కోనలలో Telugu Christian Song Lyrics

కొండలలో కోనలలో Lyrics


కొండలలో కోనలలో
బేతలేము గ్రామములో
కనిపించె ప్రభు దూత
వినిపించేను శుభ వార్త
చెలరేగెనే ఆనందము
రక్షకుని రాకతో (2)         ||కొండలలో||

కొరికేసే చలి గాలిలో
వణికించే నడి రేయిలో (2)
కాపరుల భయము తీర
పామరుల ముదము మీర (2)
దూతా గానము
శ్రావ్యా రాగము (2)
పరమ గీతము         ||కొండలలో||

దావీదు పురమందున
పశువుల శాలయందున (2)
మన కొరకే రక్షకుండు
ఉదయించే పాలకుండు (2)
రండి వేగమే
రండి శీఘ్రమే (2)
తరలి వేగమే          ||కొండలలో||

Your favourites

  • No Favourites found!