Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కొనియాడఁ దరమె నిన్ను కోమల హృదయ Telugu Christian Song Lyrics

కొనియాడఁ దరమె నిన్ను కోమల హృదయ Lyrics

కొనియాడఁ దరమె నిన్ను కోమల హృదయ కొనియాడఁ దరమె నిన్ను
తనరారు దినకరుఁ బెనుతారలను మించు ఘనతేజమున నొప్పు
కాంతిమంతుఁడ వీవు ||కొనియాడ||

1. ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు నురుతరంబుగఁ గొలువ
నొప్పు శ్రేష్ఠుఁడ వీవు ||కొనియాడ||

2. సర్వలోకంబులఁ బర్వు దేవుఁడ వయ్యు నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి
వీవు ||కొనియాడ||

3. విశ్వమంతయు నేలు వీరాసనుఁడ వయ్యుఁ పశ్వాళితోఁ దొట్టిఁ
పండియుంటివి నీవు ||కొనియాడ||

4. దోసంబులను మడియు దాసాళిఁ గరుణించి యేసు పేరున జగతి
కేగుదెంచితి నీవు ||కొనియాడ||

5. నరులయందునఁ గరుణ ధర సమాధానంబు చీకాలమును మహిమ
పరఁగఁ జేయుదు వీవు ||కొనియాడ||

6. ఓ యేసు పాన్పుగ నా యాత్మఁ జేకొని శ్రేయముగ బవళించు శ్రీకర
వరసుత ||కొనియాడ||

Your favourites

  • No Favourites found!