Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ Telugu Christian Song Lyrics

కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ Lyrics

కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను
తనరారు దినకరు – బెను తారలను మించు (2)
ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ||
కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2)
నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ||
సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2)
నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ||
విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2)
పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు ||కొనియాడ||
దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2)
యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు ||కొనియాడ||
నరులయందున కరుణ – ధర సమాధానంబు (2)
చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ||కొనియాడ||
ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2)
శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత ||కొనియాడ||

Your favourites

  • No Favourites found!