Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను Telugu Christian Song Lyrics

కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను Lyrics

కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా
1. పరిశుద్ధుడవు నీతిమంతుడవు
పాపపు వస్త్రము మార్చిన దేవ
ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి
పొగడెద నిన్ను ధవళవర్ణుడా
2. తూర్పు జ్ఞానులు నీ కర్పించిరి
బంగారు సాంబ్రాణి బోళము
తెలుపబడెను నీ ఘనవిజయము
భరియించెద నిన్ను రత్నవర్ణుడా
3. గుర్తించెద నిన్ను ఘనముగా నేను
ఘనుడా నాకు ప్రభుడవు నీవే
పదివేలలో నా ప్రియుడగు ప్రభువా
పరికించి నిన్ను పాడి స్తుతించెద
4. ఆరాధించెద ప్రభువా దేవా
ఆత్మతోను సత్యముతోను
తిరిగి రానై యున్న ప్రభువా
స్తుతియు ఘనత మహిమయు నీకే


Your favourites

  • No Favourites found!