Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కూర్చుందును నీ సన్నిధిలో  దేవా Telugu Christian Song Lyrics

కూర్చుందును నీ సన్నిధిలో దేవా Lyrics

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2)
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||
ప్రతి విషయం నీకర్పించెదా
నీ చిత్తముకై నే వేచెదా (2)
నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2)
నీ నామమునే హెచ్చించెదా (2)
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||
ప్రతి దినము నీ ముఖ కాంతితో
నా హృదయ దీపం వెలిగించెదా (2)
నీ వాక్యానుసారము జీవించెదా (2)
నీ ఘన కీర్తిని వివరించెదా (2)
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||

Your favourites

  • No Favourites found!