కోరుకున్న చెలిమి పొందెను
కలనైన ఎన్నడూ విడువదు (2)
ఈ సమయం నీదే చేరుమా (2)
వేచియున్నది నీ బంధము.. || కోరుకున్న ||
1. కలలు కంటివే నీ ప్రియుని కోసము
నీ కొరకే నిలిచుండెను
ఒకసారి ఇటు చూడుమా (2)
ఈ సమయం నీదే చేరుమా (2)
వేచియున్నది నీ బంధము.. || కోరుకున్న ||
2. మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము
ప్రేమించి దీవించెను
నీ ఆశనే తీర్చును (2)
ఈ సమయం నీదే చేరుమా (2)
వేచియున్నది నీ బంధము.. || కోరుకున్న ||
