Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కోటి కాంతుల వెలుగులతో Telugu Christian Song Lyrics

కోటి కాంతుల వెలుగులతో Lyrics

కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం
లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము
లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2)    ||కోటి కాంతుల||

రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా
మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2)
మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను
ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను
సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా
శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా
ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – (2)    ||కోటి కాంతుల||

మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా
కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2)
ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా
ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా
అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా
ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా
సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే – (2)    ||కోటి కాంతుల||

Your favourites

  • No Favourites found!