కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ
మంగళమే యేసునకు పాడారమ్మ
కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మ
కొత్త భూమి పెళ్లి పీఠమ్మ "కొత్త"
యేసు మోమున ఊసిన ఉమ్ములే
కోయిలమ్మకు కన్నీటి జల్లులమ్మ
క్రీస్తు శిరసున మూల కిరీటమే
కోయిలమ్మకు పెళ్లి ముసుగాయనమ్మ
సిలువ సన్నాయి స్వరము వినరమ్మ
వధువు సంఘము సిద్ధమాయనమ్మ "కొత్త "
యేసు చేతుల కాళ్లను మేకులె
కోయిలమ్మకు గాజుల గజ్జెలమ్మా
క్రీస్తు కల్వరి మరణ దండమే
కోయిలమ్మకు మంగళ సూత్రమమ్మ
సిలువ సన్నాయి స్వరము వినరమ్మ
వధువు సంఘము సిద్ధమాయనమ్మ "కొత్త "
