Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రైస్తవకర్షక కదిలిరావయ్యాకన్నులు తెరచి కానవేమయ్యా Telugu Christian Song Lyrics

క్రైస్తవకర్షక కదిలిరావయ్యాకన్నులు తెరచి కానవేమయ్యా Lyrics

క్రైస్తవకర్షక కదిలిరావయ్యా
కన్నులు తెరచి కానవేమయ్యా

1. మనుష్యకుమారుడైన క్రీస్తుయేసు మంచివిత్తనమును
విత్తెమున్న భూలోకంబనెడు పొలంబునందున
వాక్యంబనె విత్తనంబు విత్తెను ||క్రైస్తవ||

2. ఆదిమ క్రైస్తవ బోధకుల వేదనతోను వాక్యంబు విత్తె
రోదనతోను రక్తంబును గార్చి ప్రాణంబులను
దానంబుజేసిరి ||క్రైస్తవ||

3. చల్లిన వాక్యము ఫలియింపను తొలకరి వర్షము
గురిపించెను విలువైన ఫలములు ఫలియించువరకు
కడవరి వర్షము కొరకు వేడుదం ||క్రైస్తవ||

4. పొలములు తెల్లబారె తేరిచూడు కాలము చాల
గతించిపోయె కోతయజమా నుడైన క్రీస్తుని
కోతవారిని పంప కోరివేడుదం ||క్రైస్తవ||

5. శత్రువగు సాతానుకూడా చెడ్డవిత్తనాలు చల్లిపోయె
గోధుమల మధ్య గురుగులు కూడ ఘోరంబుగాను
పెరుగుచుండెను ||క్రైస్తవ||

6. కన్నీళ్ళతో విత్తు క్రైస్తవుడా కలవర మొందెద
వెందులకు సంతోషముతో సంగీతాలతోను
సాగిపోవుదుము ఆగిపోకను ||క్రైస్తవ||

Your favourites

  • No Favourites found!