Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తే సర్వాధికారి  Telugu Christian Song Lyrics

క్రీస్తే సర్వాధికారి Lyrics


క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి       ||క్రీస్తే||

ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత
భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన       ||క్రీస్తే||

దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి
దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన       ||క్రీస్తే||

శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి
శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన       ||క్రీస్తే||

సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప – రుధిరంబు గార్చె గాన       ||క్రీస్తే||

మృత్యువు ముళ్ళు తృపన్ – నిత్య జీవంబు బెంపన్
మర్త్యాళి భయము దీర్పన్ – మరణంబు గెలిచె గాన       ||క్రీస్తే||

పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన       ||క్రీస్తే||

ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన       ||క్రీస్తే||

Your favourites

  • No Favourites found!