Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ రించెద Telugu Christian Song Lyrics

క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ రించెద Lyrics

క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ రించెద వినరే ప్రియులార వాస్తవముగ
మరణించి బ్రతికెనని వసుధలోఁ బ్రకటింపరె యూరూరఁ ||గ్రీస్తు||

1. మరియ మగ్దలేనెకుఁ బ్రథమంబున మన గురువర్యుం డగపడియెఁ
తరుణీమణులకు రెండవ మాఱొక దర్శనము దయతో నిడియెఁ ||గ్రీస్తు||

2. సీమో నను పేతురును గూడ ద ర్శించె నతఁడు మూఁడవ మాఱు
ప్రేమతోడ నిమ్మాయి శిష్యులకుఁ బ్రియ మొనరించె మఱొక తీఱు ||క్రీస్తు||

3. తోమాలేని తరుణమునఁ బదుగురి తో వచించె గృహమునఁ జేరి
తోమాకు కనపడి యతని సంశయముఁ దొలఁగించెను బ్రభుఁ డొకసారి
||క్రీస్తు||

4. సందరంపు దరి నేడుగురికి మ త్స్యంబులు వింతగ సమకూర్చె
సందర్శించియు యాకోబునకును సంతోషము నెంతయుఁ గూర్చెఁ ||క్రీస్తు||

5. ప్రభుఁ డొక మాఱే నూరుగురిఁ దాఁ బ్రత్యక్షుం డయ్యెను పేర్మి నషయ
మొసంగి యపొస్తలులకుఁ క్రీ స్తారోహణుఁ డయ్యెను గూర్మిఁ ||క్రీస్తు||

6. హత్యఁ జేయు నేగెడు తార్సీయున కగపడి రక్షించెను సుమ్ము
మృత్యుంజయు డిప్పుడు మన కాత్మలో దృశ్యుం డగు నిది సత్యమ్ము ||క్రీస్తు||

Your favourites

  • No Favourites found!