1. క్రీస్తేసు శక్తినామమెల్లరు కీర్తించి కొల్వుడిలన్ యెపుడు కీర్తి కిరీటము
ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||
2. సాష్టాంగపడి దూతల్ పరమున నిష్ఠతో గొలుచుచును యేసుని కీర్తి
కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||
3. హతసాక్ష్యపు జనమా యేసుడె హితమతితో బిలుచున్ మిమ్ముల కీర్తి
కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||
4. ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను ఆశ్రయ రక్షణను యేసుడే కీర్తి కిరీటము
ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||
5. పాపుల రక్షించెన్ సిలువపై శాపము దొలగించెన్ యేసుడే కీర్తి కిరీటము
ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||
6. సర్వజనంబులారా క్రీస్తుని సర్వజగంబులలో ఠీవిగ కీర్తి కిరీటము
ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||
7. పరమందున్నట్టి ప్రభుదగు పరిశుద్ధ సంఘముతో మనము కీర్తి కిరీటము
ధరియింప జేయుడి క్రీస్తు నారాధింతము ||క్రీస్తే||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
క్రీస్తేసు శక్తినామమెల్లరు కీర్తించి కొల్వుడిలన్ యెపుడు Lyrics
Your favourites
- No Favourites found!