Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు Telugu Christian Song Lyrics

క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు Lyrics

క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు మంగళం క్రీస్తుయేసే దైవమంచును
కూడి పాడుదు మంగళం||

1. ప్రవచనంబులు బల్కినట్టి ప్రాణనాధుడవీవె నీదు స్తవము జేయుచు
మెలగు మనుజుల సత్ప్రభువుకిదె మంగళం||క్రీస్తు||

2. జగమునేలెడు జీవనాధుడ జపములందెడు గృపకటాక్ష అగణీ తంబగు
ప్రేమజూపిన అమరతేజుడ మంగళం||క్రీస్తు||

3. ఖలుల బ్రోచెడు కనికరాత్మ కేంద్ర స్థానము నీ పదాబ్జము కలుషమును
కడమార్చినట్టి సిలువ నాధుడ మంగళం||క్రీస్తు||

4. మనము గోరెడు మా హృదీశుడ మార్గదర్శుడ వీవెగావ అనయము
నినుగొల్చు జనముల ఆది దేవుడ మంగళం||క్రీస్తు||

5. జనకసుత శుద్ధాత్మ దేవుడ గనని వినని ప్రేమ పూర్ణుడ తనివితీరగ
పాడుదము యీ ధాత్రి నీకగు మంగళం||క్రీస్తు||

Your favourites

  • No Favourites found!