1. క్రీస్తు యోధులారా
యుద్ధ మాడుఁడీ
క్రీస్తు సిల్వ మీరు
పట్టి గెల్వుఁడీ
మన రాజు క్రీస్తు
దండు నడ్పును
చూడు మాకు ముందు
క్రీస్తు ధ్వజము.
|| క్రీస్తు వీరులారా
యుద్ధ మాడుఁడీ
క్రీస్తు ధ్వజ మెత్తి
జయ మొందుఁడీ ||
2. లోక రాజ్య కీర్తి
వాడిపోవును
క్రీస్తు రాజ్యమైన
నిత్య ముండును
సాతా నాధిపత్య
మాఁగిపోవును
క్రీస్తు దివ్య సభ
జయ మొందును.
3. ఓ జనంబులారా
వచ్చి చేరుఁడీ
జయ కీర్తనంబు
లెత్తి పాడుఁడీ
కీర్తి, స్తుతి, ఘవ
మెన్నఁ డుండును
మన క్రీస్తు రాజు
నిత్య మేలును.
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
క్రీస్తు యోధులారాయుద్ధ మాడుఁడీక్రీస్తు సిల్వ మీరుపట్టి Lyrics
Your favourites
- No Favourites found!
